రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధమే: జైశంకర్‌

కీవ్‌ పర్యటనలో భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రితో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు. యుద్ధభూమిలో కాకుండా చర్చలు, దౌత్యం ద్వారానే ఈ సంఘర్షణకు పరిష్కారం సాధ్యమని జైశంకర్ పేర్కొన్నారు. ఈ విషయంలో అవసరమైన సహాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕