రష్యా సెంట్రల్ బ్యాంక్ గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా తన రిజర్వుల్లోని ఫిజికల్ గోల్డ్‌ను అమ్మడం ప్రారంభించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా పెరుగుతున్న సైనిక ఖర్చులు, బడ్జెట్ లోటును భర్తీ చేసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. 2026 మొదటి 2 నెలల్లోనే రష్యా సుమారు 35 బిలియన్ డాలర్ల విలువైన గోల్డ్ రిజర్వ్స్‌ను అమ్మేసినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. క్రూడ్ రేట్లు పడిపోవడం, పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల ఆదాయం తగ్గడం వంటి కారణాలతో రష్యా తన లిక్విడ్ రిజర్వ్స్ అయిన బంగారాన్ని అమ్మకానికి పెట్టింది.