శబరిమల వివాదం.. మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టులో విచారణ

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. రాజ్యాంగ ధర్మాసనం, మహిళలను నెలలో 3 రోజులు అంటరానివారిగా చూడలేమని వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 25, 26 ప్రకారం మత స్వేచ్ఛ పరిధిని పరిశీలిస్తున్న ధర్మాసనం, సామాజిక రుగ్మతలను మత ఆచారాలుగా పరిగణించలేమని తెలిపింది. 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను గుడిలోకి అనుమతించకపోవడాన్ని వివక్షగా పరిగణించలేమని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. 2018లో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీం తీర్పునిచ్చినప్పటికీ, ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.

సంబంధిత పోస్ట్