హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో బుధవారం నాడు యాదవుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం ఎంతో ఘనంగా జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్, ఇతర ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. అలాగే, ఢిల్లీ నుంచి తేజస్వి యాదవ్, ధర్మేంద్ర యాదవ్ తదితర నాయకులు పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ వేడుకలో గోమాత పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, దున్నపోతుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.