ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంది. మానవ వనరుల పోర్టల్‌లో ఆస్తి వివరాలు అప్‌లోడ్ చేయని 68,236 మంది రాష్ట్ర ఉద్యోగుల జీతాలను నిలిపివేసింది. ఆస్తుల వివరాలు సమర్పించే వరకు జీతాలు విడుదల చేయబోమని స్పష్టం చేసింది. జనవరి 31 గడువు ఇచ్చినా పలువురు ఉద్యోగులు నిర్లక్ష్యం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో మూడో, నాల్గో కేటగిరీలతో పాటు తొలి రెండు కేటగిరీల ఉద్యోగులూ ఉన్నారు. పారదర్శకత, అవినీతి నిర్మూలన లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.