తెలంగాణలో నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానం 2027 నవంబరు వరకు కొనసాగనుంది. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు గణనీయమైన ఆదాయం సమకూరుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. గత రెండేళ్లలో (2023-25) మద్యం అమ్మకాలు ఊహించని విధంగా పెరిగి, రూ.71,550 కోట్లకు చేరుకున్నాయి. ఈ కాలంలో 724 లక్షల కేసుల లిక్కర్, 960 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుత ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు రూ.29,766 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి.