దేశంలో మోతాదుకు మించి ఉప్పు వినియోగం ఉంటోందని, దీని ప్రతికూల ఫలితాలు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయని తాజాగా ICMR పేర్కొంది. హైపర్‌టెన్షన్, స్ట్రోక్, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారిలో ముప్పు మరింత పెంచుతోందని ఐసీఎంఆర్ (ICMR)కు చెందిన 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమిడమాలజీ' శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉప్పు వినియోగం తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా అధ్యయనం చేయడంతో పాటు తక్కువ సోడియం ఉన్న ప్రత్యామ్నాయ ఉప్పుపై దృష్టి సారిస్తున్నారు.