ఆసియా పారా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. పురుషుల టీ64 400 మీటర్ల పరుగు పందెంలో సందీప్ ప్రపంచ రికార్డుతో స్వర్ణం సాధించగా, అదే విభాగంలో అజేయ్ కాంస్య పతకం దక్కించుకున్నారు. పురుషుల ఎఫ్ 37/38 జావెలిన్ త్రోలో హెనీ ప్రపంచ రికార్డును నెలకొల్పారు. పారా బ్యాడ్మింటన్ ఎస్ఎల్-3లో నితీశ్ కుమార్, ఎస్ఎల్-4లో నవీన్ శివకుమార్ స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. మెన్స్ డబుల్స్ ఆర్చరీలో హర్వీందర్ సింగ్, విజయ్ సుండి జోడీ బంగారు పతకాలను గెలుచుకుని దేశ కీర్తిని పెంచారు.