జోగిపేట ఏరియా, ఆందోలు మండలంలోని తలెల్మ నేరేడు గుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రులకు వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవల తీరును అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆమె సూచించారు.