గుమ్మడిదల ఏడీఈ దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, గురువారం 132/11 సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా గుమ్మడిదల, జిన్నారం, బొంతపల్లి, దుండిగల్ ఎయిర్ ఫోర్స్, గడ్డపోతారం ఎస్ఎస్-1, గడ్డపోతారం ఎస్ఎస్-2, సోలార్ పరిశ్రమ ఏరియాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఈ అంతరాయం మరమ్మతుల పనుల కారణంగా ఏర్పడుతుందని ఆయన తెలిపారు.