జోగిపేటలో విదేశీ ఖైదీల కోసం ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ హోం కేంద్రాన్ని ఎస్పీ పరితోష్ పంకజ్ మంగళవారం పరిశీలించారు. ఫారన్ ఖైదీల కోసం జైలులో చేసిన ఏర్పాట్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. జైలు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విదేశీ ఖైదీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు ఆయన వెంట ఉన్నారు.