మంజీర పరివాహక ప్రాంతంలో జరుగుతున్న అక్రమ చేపల పెంపకం, దానివల్ల కలుగుతున్న నీటి కాలుష్యంపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మంత్రి దామోదర రాజనర్సింహ సంగారెడ్డి కలెక్టర్‌ను ఆదేశించారు. మంజీర జలాల నాణ్యతపై పరీక్షలు నిర్వహించాలని, ప్రజారోగ్యానికి, తాగునీటికి ముప్పు కలిగిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నీటి నాణ్యత విషయంలో ప్రజల్లో అపోహలు తొలగించేలా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.