సంగారెడ్డి మున్సిపాలిటీ 12వ వార్డులోని వీకర్ సెక్షన్ కాలనీలో మురుగు కాల్వల సమస్యను పరిష్కరించాలని కోరుతూ, ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి గురువారం వినతి పత్రం సమర్పించారు. ఫోరం అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ, మురుగు కాల్వలు లేకపోవడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.