గురువారం నాడు హత్నూర పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను పరిశీలించి, పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని ఎస్ఐకి సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీధర్ రెడ్డి కూడా ఉన్నారు.