ఈ నెల 14వ తేదీన జరగనున్న పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, 10 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 46 జోన్లు, 56 రూట్లు, 10 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, 10 మైక్రో అబ్జర్వర్లు, 436 వెబ్ కాస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బంది ఈ నెల 13వ తేదీన విధుల్లో చేరాలని సూచించారు.