వాసర వంతెన వద్ద భయం గుప్పిట్లో ప్రయాణికులు

కంగ్రి - నారాయణఖేడ్ ప్రధాన రహదారిపై ఉన్న వాసర ఊరవాగు వంతెన పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. గత ఏడాది వర్షాలకు వంతెన కోతకు గురవ్వడంతో రహదారి ఇరుకుగా మారి, ఎదురెదురుగా వాహనాలు వస్తే ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో అధికారులు తక్షణమే స్పందించి, మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్