నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోలో గురువారం రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డిఎస్పి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఆర్టీసీ డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సురక్షితమైన ప్రయాణాల ద్వారా ప్రజలకు ఆర్టీసీపై నమ్మకాన్ని కలిగించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎం సుబ్రహ్మణ్యం కూడా పాల్గొన్నారు.