నారాయణఖేడ్ లో ప్రజా పాలన: ఎమ్మెల్యే సంజీవరెడ్డి అభివృద్ధి పనులపై సమీక్ష

నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్థానిక సాయి బాబా ఫంక్షన్ హాల్‌లో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని మౌలిక వసతులు, పెండింగ్ అభివృద్ధి పనులు, ప్రజా పాలన దరఖాస్తుల పురోగతిపై ఈ సందర్భంగా సమీక్షించారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ ఉమా హారతి, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕