సంగారెడ్డి జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రిసైడింగ్, సహ-ప్రిసైడింగ్ అధికారులకు ఫిబ్రవరి 2న శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎన్నికల నోడల్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల వ్యాప్తంగా మొత్తం 1,298 మంది అధికారులకు ఆయా కేంద్రాల్లో ఎన్నికల విధులు, నిబంధనలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.