మల్కాజ్రి మాజీ ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం కళ్లకల్ గ్రామ సమీపంలోని బంగారమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. 44వ జాతీయ రహదారిపై కూడా భారీగా పోలీసులను మోహరించారు. పూజలు విజయవంతంగా పూర్తయిన తర్వాత మాజీ ఎమ్మెల్యే తన స్వగ్రామం కొర్విపల్లికి వెళ్తారని పోలీసులు తెలిపారు.