పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్, వెంకటేశ్వర కాలనీ, ఆల్విన్ కాలనీల, నందన్ రతన్ ప్రైడ్ కాలనీలతో పాటు యాదవ సంఘం, నాయి బ్రాహ్మణ సంఘం, ముదిరాజ్ సంఘం స్మశాన వాటికలలో రెండు కోట్ల 51 లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.