విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గడ్డపోతారం మున్సిపల్ కమిషనర్ వెంకట రామయ్యను మున్సిపల్ శాఖ శనివారం సస్పెండ్ చేసింది. ఆయన స్థానంలో గుమ్మడిదల కమిషనర్ దశరథ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సస్పెన్షన్ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.