పటాన్ చెరు ట్రాఫిక్ నూతన సీఐగా అశోక్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతామని తెలిపారు. సీఐ లాలూ నాయక్ బదిలీపై హైదరాబాద్ ఐజీ కార్యాలయానికి వెళ్లగా, వికారాబాద్ ఎస్బీలో సీఐగా విధులు నిర్వహిస్తున్న అశోక్ ఇక్కడ బాధ్యతలు చేపట్టారు.