తెలంగాణలోని తెల్లాపూర్ డివిజన్ పరిధిలో, హుడా కమాన్ నుండి రేడియం రోడ్డు వరకు గల ప్రధాన రహదారి మీడియన్ మరియు పాత్ వే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ పనులకు సుమారు 87 లక్షల రూపాయలు కేటాయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దేవేందర్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు లచ్చి రామ్ నాయక్, బాబ్జి, శ్రీశైలం, శ్రీకాంత్, ఉమేష్, రవీందర్ రెడ్డి, నాగరాజు, మరియు బల్దియా ఇంజనీరింగ్ విభాగం డిఈ కృష్ణవేణి పాల్గొన్నారు.