జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర మాట్లాడుతూ, కేసులను రాజీ మార్గంలో పరిష్కరించేందుకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శనివారం జిల్లా కోర్టులో జరిగిన ఈ కార్యక్రమంలో, తక్కువ ఖర్చుతో కేసులు పరిష్కరించుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. కలెక్టర్ ప్రావీణ్య కూడా పెండింగ్ వివాదాలు, కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు.