సంగారెడ్డిలో రోడ్లపై చెత్త వేయొద్దని పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోని షాప్ యజమానులకు మున్సిపల్ అధికారులు వినూత్న శిక్ష విధించారు. చెత్త వేస్తున్నవారితోనే ఆ చెత్తను సేకరింపజేశారు. ఇకపై నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని, వ్యాపారులు బట్ట సంచులు వాడాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.