కంది తహసీల్దార్‌గా హసీనా బేగం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేసిన రవికుమార్ పదోన్నతి పొంది ములుగు డిఆర్ఓగా వెళ్లారు. నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన హసీనా బేగమ్‌ను కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటానని, వారి సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.