శుక్రవారం సంగారెడ్డి రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా (సీఐ) నయీముద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ మల్టీ జోన్-2 నుంచి బదిలీపై వచ్చిన ఆయనను స్టేషన్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. రూరల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు ప్రత్యేకంగా కృషి చేస్తానని నూతన సీఐ నయీముద్దీన్ స్పష్టం చేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన క్రాంతికుమార్ హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు.