సదాశివపేట మున్సిపాలిటీ ఓటర్ల ముసాయిదా జాబితాను మున్సిపల్ కమిషనర్ శివాజీ శుక్రవారం విడుదల చేశారు. ఈ జాబితాలో మొత్తం 37,133 మంది ఓటర్లు ఉన్నారు, వీరిలో 18,905 మంది పురుషులు, 18,226 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఉన్నారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాను మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 5వ తేదీలోగా కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.