సంగారెడ్డి: స్కూల్ బస్సులతో శుభకార్యాల దందా!

నిబంధనలకు విరుద్ధంగా శుభకార్యాలు, టూర్లకు తిరుగుతున్న స్కూల్ బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ టూర్ అండ్ ట్రావెల్స్ బస్ ఓనర్ అసోసియేషన్ రవాణా శాఖను కోరింది. ఫిట్నెస్, టాక్స్లు చెల్లిస్తున్న తమ ఉపాధిని స్కూల్ బస్సులు దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం విద్యార్థులకే పరిమితం కావాల్సిన బస్సులను కమర్షియల్ పనులకు వాడకుండా అడ్డుకోవాలని అధికారులకు వినతి పత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్