సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని అభయాంజనేయ స్వామి దేవాలయం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో సత్యనారాయణ గౌడ్ అధ్యక్షునిగా, విశ్వనాథరావు ప్రధాన కార్యదర్శిగా, శ్రీనివాస్ కోశాధికారిగా, మంజీత్ రెడ్డి ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు.