మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ గా చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ సిబ్బంది నూతన మేనేజర్ ను ఘనంగా సన్మానించారు. బదిలీపై వెళ్తున్న మేనేజర్ శ్రీదేవిని కూడా శాలువాతో సన్మానం చేశారు. నూతన మేనేజర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రైతుల ధాన్యం కొనుగోలు వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.