సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. భవిత కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం 1.58 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసిందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు.