సంగారెడ్డి మున్సిపాలిటీ ఓటర్ల జాబితా విడుదల

సంగారెడ్డి మున్సిపాలిటీ ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఈ జాబితాలో మొత్తం 83,948 మంది ఓటర్లు ఉన్నారు, వీరిలో 41,719 పురుషులు, 42,221 మహిళలు, 8 మంది ఇతరులు ఉన్నారు. ఓటర్ల జాబితా మున్సిపల్ కార్యాలయంలో వార్డుల వారీగా అందుబాటులో ఉంచబడింది. జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే 5వ తేదీ లోపు కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్