సంగారెడ్డి సమగ్రత కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 14వ తేదీన ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావిణ్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10: 30 నుంచి మధ్యాహ్నం 1: 30 గంటల వరకు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.