సంగారెడ్డి: నేడు ప్రజావాణి కార్యక్రమం

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో, డివిజన్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రజలు తమ వినతి పత్రాలను నేరుగా అందజేయవచ్చు. అధికారులు అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

సంబంధిత పోస్ట్