సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మంగళవారం మాట్లాడుతూ, రోడ్డుపై ఎవరైనా చెత్త వేస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని తెలిపారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరుచేసి, తమ వాహనాల్లోనే వేయాలని సూచించారు. రోడ్డుపై చెత్త వేసే వారిని గుర్తించడానికి ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.