సంగారెడ్డి: కోఆప్షన్ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక

సంగారెడ్డి మున్సిపాలిటీలో సోమవారం నలుగురు కోఆప్షన్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జనరల్ కేటగిరీ నుంచి శివశంకర్, యశోద, మైనార్టీ కేటగిరీ నుంచి సలావుద్దీన్, నఫీజ్ సుల్తానా నామినేషన్లు దాఖలు చేశారు. వేరే నామినేషన్లు దాఖలు కాకపోవడంతో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అభ్యంతరాలు రాలేదు.

సంబంధిత పోస్ట్