మంచినీటి మరమ్మత్తుల కారణంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో శనివారం మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 16 మంచి నీటి ట్యాంకుల నుంచి నీటి సరఫరా జరగదని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని ఆయన చెప్పారు.