సంగారెడ్డి జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో మనూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో మహిళల భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలు, మహిళలు, యువతకు అవగాహన కల్పించిన డివిజన్ షీటీం ఇంచార్జీ ఏఎస్ఐ తులసిరాం, మహిళల రక్షణకు షీ టీమ్ నిరంతరం కృషి చేస్తోందని, లింగ వివక్ష, పని ప్రదేశాల్లో వేధింపులు, బాలల రక్షణ చట్టాలు, మహిళల హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆన్లైన్ మోసాలు, ఫేక్ అకౌంట్లపై కూడా హెచ్చరించారు.