సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్లలో పరిష్కారం కాని సమస్యలపై నేరుగా తనను కలిసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 14 మంది తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ ఎస్ఐలకు ఆయన ఆదేశించారు.