శనివారం న్యాల్కల్ మండలం హద్నూర్ పోలీస్ స్టేషన్ ను ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లోని రికార్డులను పరిశీలించి, పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని పోలీసులకు సూచించారు. ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని ఆదేశించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.