సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ వర్గాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.2 వేల కోట్ల బకాయిలను సోమవారం సాయంత్రం విడుదల చేయనున్నట్లు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ ప్రకటించారు. ఇందులో పది లక్షల లోపు బిల్లులు, ఉద్యోగుల జీపీఎఫ్, పోలీసుల సరెండర్ లీవులు, విద్యార్థుల ఫీజు రియంబర్స్‌మెంట్ లాంటివి ఉన్నాయి.