చెట్లు లేని ప్రాంతాల్లోనూ ఆక్సిజన్ అందించేందుకు శాస్త్రవేత్తలు ‘లిక్విడ్ ట్రీస్’ అనే సాంకేతికతను అభివృద్ధి చేశారు. సెర్బియాలోని యూనివర్సిటీ ఆఫ్ బెల్‌గ్రేడ్‌కు చెందిన పరిశోధకులు రూపొందించిన ఈ ఫోటో బయోరియాక్టర్లు, మైక్రో ఆల్గేతో నిండిన ట్యాంకులుగా పనిచేస్తాయి. డాక్టర్ ఇవాన్ స్పాసోజెవిక్ నేతృత్వంలో రూపొందిన ‘లిక్విడ్ 3’ యూనిట్‌ను బెల్‌గ్రేడ్‌లో ఏర్పాటు చేశారు. ఈ పరికరాలు కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్ విడుదల చేస్తాయి. సాధారణ చెట్లకంటే వేగంగా గాలిని శుద్ధి చేసే సామర్థ్యం వీటికి ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పరిశోధనా దశలో ఉంది.