AP: కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. డిప్యూటీ కలెక్టర్ తాతా మోహన్ రావును తహశీల్దార్‌గా డిమోట్ చేస్తూ తీర్పు వెలువరించింది. హైకోర్టు ఆదేశాలను ఆయన ఉల్లంఘించి 2014లో గుంటూరులోని ఒక ప్రాంతంలో ఆక్రమణలు తొలగించారు. ఆ కేసులో ఆయనకు AP హైకోర్టు గతంలో 2 నెలల జైలు శిక్ష, రూ.2000ల జరిమానా విధిస్తూ 2015 మార్చి 27న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఆయన SCలో సవాల్ చేయగా విచారణ సందర్భంగా కోర్టు సంచలన తీర్పునిచ్చింది.