దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్ల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టుల అమలు బాధ్యతలను నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు అప్పగించారు. ముంబై-పుణె, పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగురి, ముంబై-అహ్మదాబాద్ మార్గాల్లో బుల్లెట్ రైళ్లు రానున్నాయి. పార్లమెంటరీ ప్యానెల్ కమిటీ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని, భూసేకరణ, అనుమతులు వేగవంతం చేయాలని సూచించింది. వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి తొలి బుల్లెట్ ట్రైన్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.