తెలంగాణలో పోలీసు సేవలను మెరుగుపరిచేందుకు డీజీపీ సీవీ ఆనంద్ ఏడు డిజిటల్ సేవలను ప్రారంభించారు. ఇందులో పౌరుల అభిప్రాయాల సేకరణకు సిటిజన్ ఫీడ్బ్యాక్ సెంటర్, 35 భరోసా కేంద్రాల పర్యవేక్షణకు ప్రత్యేక సాఫ్ట్వేర్, ఖైదీల విడుదల సమాచార వ్యవస్థ ఉన్నాయి. అలాగే 9.8 లక్షలకు పైగా ఫొటోలతో రూపొందించిన ఫేస్ సెర్చ్ యాప్ ద్వారా 15 సెకన్లలో ముఖాలను సరిపోల్చవచ్చు. నేరస్థలాల్లో వేలిముద్రల సేకరణకు ప్రత్యేక యాప్, దర్యాప్తు అధికారుల కోసం ఐదు సంపుటాల ఎస్ఓపీలను అందుబాటులోకి తెచ్చారు. వీటితో నేర పరిశోధన వేగవంతం కానుందని అధికారులు తెలిపారు.