TG: దేశవ్యాప్తంగా హోంశాఖ ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ ఎంపికైంది. దేశంలోనే ఏడో ఉత్తమ పీఎస్‌గా, తెలంగాణలో మొదటిస్థానం సాధించింది. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లను హోంశాఖ ఎంపిక చేస్తున్న విషయం తెలిసిందే. తాజా జాబితాలో శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ చోటు దక్కించుకుంది.