ఢిల్లీ హైకోర్టులో ఏప్రిల్ 29న వర్చువల్ వాదనలు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా పోర్న్ వీడియో ప్లే అయింది. చీఫ్ జస్టిస్ కోర్టురూమ్‌లోనే ఈ ఘటన జరగడం, రెండుసార్లు వీడియో ప్లే అవ్వడంతో న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే వర్చువల్ కోర్టు వాదనలను నిలిపివేశారు. వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్‌ను షట్‌డౌన్ చేసి, మళ్లీ స్టార్ట్ చేసినా సమస్య కొనసాగింది. సిస్టమ్ హ్యాక్ అయినట్లు మెసేజ్ రావడం, ఆటోమెటిక్ వాయిస్ వినిపించడంతో సైబర్ అటాక్ జరిగిందని పుకార్లు వ్యాపించాయి. నిందితుడు స్క్రీన్ షేర్ చేసి వీడియోలు ప్లే చేసినట్లు ఆరోపణలున్నాయి.