వేసవిలో 3, 4, 5 బ్లేడ్ల ఫ్యాన్లలో ఏది ఉత్తమం?

వేసవిలో సీలింగ్ ఫ్యాన్ తప్పనిసరి. అయితే, 3, 4, 5 బ్లేడ్ల ఫ్యాన్లలో ఏది ఎక్కువ గాలిని అందిస్తుంది, ఏది తక్కువ విద్యుత్ వినియోగిస్తుంది అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. సాధారణంగా భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే 3-బ్లేడ్ ఫ్యాన్లు తక్కువ శక్తితో వేగంగా తిరుగుతూ బలమైన గాలిని అందిస్తాయి. ఇవి విద్యుత్ ఆదాలో కూడా ముందుంటాయి. 4-బ్లేడ్ ఫ్యాన్లు మృదువైన గాలి ప్రవాహాన్ని, తక్కువ శబ్దాన్ని అందిస్తాయి. 5-బ్లేడ్ ఫ్యాన్లు అలంకరణకు బాగుంటాయి కానీ గాలి శక్తి తక్కువగా ఉంటుంది. విద్యుత్ ఆదా విషయానికి వస్తే 3-బ్లేడ్ ఫ్యాన్ అత్యంత పొదుపైనవి.

సంబంధిత పోస్ట్